వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి షాక్: బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Apr 27, 2023, 11:33 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  ఏ1 నిందితుడు  ఎర్రగంగిరెడ్డి  బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు  చేసింది. 


హైదరాబాద్:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి   హత్య కేసులో  ఏ 1 నిందితుడు  ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ ను తెలంగాణ హైకోర్టు  గురువారంనాడు  రద్దు  చేసింది. ఈ ఏడాది మే  5వ తేదీ లోపుగా  సీబీఐ jకోర్టులో   లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డిని ఆదేశించింది.  ఒకవేళ గంగిరెడ్డి  లొంగిపోకపోతే  అరెస్ట్  చేయవచ్చని సీబీఐకి సూచించింది  తెలంగాణ హైకోర్టు.  ఈ ఏడాది  జూన్  30  వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణ  పూర్తవుతున్నందున  జూలై  1న డీపాల్ట్  బెయిల్  ఇవ్వాలని   సీబీఐ  కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  ఏ1 నిందితుడిగా  ఉన్న  ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ ను రద్దు  చేయాలని  సీబీఐ    కోర్టును ఆశ్రయించింది.   ఈ  పిటిషన్ పై  వైఎస్ సునీతారెడ్డి  కూడా ఇంప్లీడ్ అయ్యారు.   ఈ నెల  26, 27 తేదీల్లో  కూడా  తెలంగాణ హైకోర్టులో వాదనలు  జరిగాయి.  అందరి వాదనలను  తెలంగాణ హైకోర్టు విన్నది.  ఇవాళ తీర్పును వెల్లడిస్తామని  హైకోర్టు  తెలిపింది. ఇవాళ  పదకొండు గంటల తర్వాత ఎర్రగంగిరెడ్డి  బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పును వెల్లడించింది.  గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. 

Latest Videos

undefined

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  ఏ 1 నిందితుడు గంగిరెడ్డి  కీలక పాత్రధారి అని  సీబీఐ  ఆరోపిస్తుంది. బెయిల్ పై  గంగిరెడ్డి   బెయిల్ పై  బయట ఉంటే  దర్యాప్తును  ప్రభావితం  చేసే అవకాశం ఉందని సీబీఐ అనుమానిస్తుంది. ఇదే  విషయాన్ని  సీబీఐ తరపు న్యాయవాదులు  వాదనలు విన్పించారు.   సీబీఐ  వాదనలతో  హైకోర్టు  ఏకీభవించింది.  గంగిరెడ్డి  బెయిల్ ను రద్దు  చేస్తూ  ఇవాళ  తీర్పును వెల్లడించింది. 

గతంలో  ఈ కేసును విచారించిన  సిట్  సకాలంలో చార్జీషీట్ దాకలు చేయని కాారణంగా  ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ లభించిన విషయాన్ని  సీబీఐ  గుర్తు  చేస్తుంది.  ఈ కేసులో కీలకపాత్రధారిగా  ఉన్న గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని 2022 నవంబర్  14న సుప్రీంకోర్టును  ఆశ్రయించింది  సీబీఐ.   ఈ పిటిషన్ పై విచారణ  నిర్వహించింది  సుప్రీంకోర్టు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తున్నందున  ఈ కేసును కూడా  తెలంగాణ హైకోర్టు  విచారించాలని ఆదేశించింది.  తెలంగాణ హైకోర్టులో   ఈ విసయమై  అన్ని వర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు  గంగిరెడ్డి  బెయిల్ ను రద్దు  చేసింది. 

also read:వైఎస్ వివేకా హత్య: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు తీర్పు

ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ రద్దు  చేయడంతో  సీబీఐకి ఊరట  లభించింది.   వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు దర్యాప్తు కీలక దశకు  చేరుకుంది.  ఈ ఏడాది జూన్ 30 లోపుగా  విచారణను  పూర్తి  చేయాలని సుప్రీంకోర్టు  ఇటీవలనే  ఆదేశాలు  జారీ చేసింది.విచారణ  పూర్తైన  మరునాడే  గంగిరెడ్డికి  డీఫాల్ట్  బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు  ఆదేశించింది. 


 

click me!