YS Viveka Case: వివేకా హత్య కేసులో సీఎం జగన్‌నూ సీబీఐ విచారించాలి: టీడీపీ నేత పట్టాభి

By telugu team  |  First Published Nov 16, 2021, 5:35 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం, ఆయన కూతురు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లోని వివరాలను పేర్కొంటూ ఆయన ఈ డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనుక ఉండి నడిపించిన శంకర్ రెడ్డి.. సీఎం జగన్‌కు ఆప్తుడైన ఎంపీ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు అని ఆరోపించారు.
 


మంగళగిరి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. సొంత బాబాయి అని కూడా చూడకుండా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు అన్ని విధాల సహకరించాడని ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకానంద రెడ్డి కూతురు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్ డాక్యుమెంట్ కాపీల్లోని వివరాలను ఆయన పేర్కొంటూ ఈ డిమాండ్ చేశారు.

దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలున్నాయని పట్టాభి తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్రా గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడని వివరించారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత దస్తగిరి సహా పలువురు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని, అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని హామీనిచ్చిట్టు శంకర్ రెడ్డి భరోసా ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నట్టు తెలిపారు. ఆ తర్వాత కూడా దస్తగిరి మరో కీలక విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లు రాజా రెడ్డి హాస్పిటల్‌లో రక్తపు మరకలను కడిగినట్టు వాంగ్మూలంలో చెప్పారని అన్నారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత పేరుతో ఉన్న రాజారెడ్డి హాస్పిటల్‌కే ఎందుకు వెళ్లారో చెప్పాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అక్కడైతే అందరూ తమ వారే ఉంటారు కాబట్టి.. భయపడాల్సిన పని ఉండదని అక్కడి వెళ్లినట్టే కదా అని పట్టాభి ఆరోపించారు.

Latest Videos

Also Read: YS Viveka Murder: వివేకా రక్తపుమరకల వెనకున్నది రక్తసంబంధీకులే...: టిడిపి అనురాధ సంచలనం

కాగా, శంకర్ రెడ్డి మరెవరో కాదని, కడప ఎంపీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆప్తుడైన వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడని టీడీపీ నేత పట్టాభి అన్నారు. అంతేకాదు, వివేకా హత్య జరిగిన రోజు సంఘనా స్థలికి చేరుకుని సాక్ష్యాలను వీరిద్దరే అంటే అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలే తారుమారు చేశారని ఆరోపించారు.

వివేకా హత్య జరిగినప్పుడు సాక్షి మీడియా దాన్ని గుండెపోటుగా చిత్రించిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేర్కొన్నారు. సాక్షి మీడియాకు వివేకా గుండె పోటుతో మరణించాడని చెప్పింది కూడా శంకర్ రెడ్డే అని తెలిపారు. ఈ విషయాన్ని సునీత పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జగన్ మీడియా చేసిందని ఆరోపించారు.

Also Read: YS Viveka case: అవినాశ్ రెడ్డిని ఇరికించే కుట్ర... ఆధారాలు బయటపెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని, సక్రమంగా సాగాలని సునీత్ పలుసార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డిని అభ్యర్థించారని తెలిపారు. కానీ, సీఎం జగన్ మాత్రం వాటికి ఖాతరు చేయలేదని, ఆమెను మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. సిట్‌ను రెండు సార్లు మార్చి నీరుగార్చే పని సీఎం జగన్ చేశారని పట్టాభి ఆరోపించారు. ఇలా సునీతను మానసికంగా బాధపెట్టారని వివరించారు. అందుకే అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతోపాటు సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.

click me!