రేపు విచారణకు రావాలి: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు

By narsimha lodeFirst Published May 15, 2023, 5:12 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ ఇవాళ  నోటీసులు  జారీ చేసింది.  

హైదరాబాద్: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సోమవారంనాడు సీబీఐ  నోటీసులు  జారీ చేసింది.  రేపు విచారణకు  రావాలని  ఆ నోటీసులో  పేర్కొంది. రేపు  ఉదయం 11  గంటలకు  విచారణకు  రావాలని   వైఎస్ అవినాష్ రెడ్డిని  ఆ నోటీసులో  సీబీఐ  కోరింది. కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ అధికారులు   వాట్సాప్ లో  నోటీసులు పంపారు. ఇవాళే హైద్రాబాద్ నుండి  కడపకు  వైఎస్ అవినాష్ రెడ్డి వెళ్లారు.   అయితే  సీబీఐ నోటీసులు  జారీ చేయడంతో  కడప  నుండి  వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ కు  బయలుదేరారు. 

కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ విషయంలో  తెలంగాణ హైకోర్టు   సానుకూలంగా  స్పందించలేదు.  దీంతో  రేపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు  పిలవడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 

Latest Videos

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐ  ఆరోపణలు  చేసింది.  కోర్టుకు  సమర్పించిన కౌంటర్లలో  వైఎస్ అవినాష్ రెడ్డిపై  సీబీఐ ఆరోపణలు  చేసింది.  కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అవసరమైతే  అరెస్ట్  చేస్తామని  సీబీఐ తరపు న్యాయవాది  గతంలో  తెలంగాణ  హైకోర్టులో  ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు  రాసినట్టుగా  చెబుతున్న లేఖను కూడా సీబీఐ అధికారులు  నిన్ హైడ్రిన్ పరీక్షకు  పంపనున్నారు. ఈ మేరకు  హైకోర్టులో  సీబీఐ అధికారులు  హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. 

also read:చిన్న అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వాలి: దస్తగిరితో సీబీఐ అధికారులు

గత మాసంలో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు  వరుసగా విచారించారు.  ఉదయ్ కుమార్, రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలతో కలిపి  అవినాష్ రెడ్డిని విచారించారు. ఈ ముగ్గురిని వేర్వేరుగా కూడా విచారించారు.    వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణను   ఈ ఏడాది జూన్  30వ తేదీ లోపుగా  పూర్తి చేయాలని  సీబీఐని సుప్రీంకోర్టు  ఆదేశించింది.  దీంతో ఈ కేసు దర్యాప్తును  సీబీఐ అధికారులు వేగవంతం  చేశారు. ఈ కేసుకు సంబంధించి  శాస్త్రీయమైన ఆధారాలను  కూడా  సీబీఐ  అధికారులు  సేకరిస్తున్నారు. 2019  మార్చి  14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకు గురయ్యారు. వైఎస్ వివేనాకందరెడ్డి హత్య  కేసును ఏపీ హైకోర్టు ఆదేశం మేరకు  సీబీఐ  విచారిస్తుంది. 

click me!