ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం.. కూలిన శ్లాబ్.. ఆరుగురు ప్రయాణికులకు గాయాలు..

Published : May 15, 2023, 04:36 PM IST
ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం.. కూలిన శ్లాబ్.. ఆరుగురు ప్రయాణికులకు గాయాలు..

సారాంశం

ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్టాండ్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద శ్లాబ్ కూలింది.

ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్టాండ్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద శ్లాబ్ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పాత బస్టాండు భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. బస్టాండ్‌లో పరిస్థితులపై అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు