మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

Published : Dec 18, 2020, 11:39 AM ISTUpdated : Dec 18, 2020, 01:22 PM IST
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

సారాంశం

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై శుక్రవారం నాడు ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుండి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై శుక్రవారం నాడు ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుండి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ విషయమై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తోంది.

 


బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ఎగవేత కేసులో 2019 డిసెంబర్ మాసంలో కూడ రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై కూడ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆ సమయంలో హైద్రాబాద్, బెంగుళూరు, గుంటూరులలోని కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ శ్రీధర్ తో పాటు ఇంకా పలువురి ఇళ్లలో కూడ సోదాలు నిర్వహించారు.

యూనియన్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు రూ. 300 కోట్లు ఎగవేశారని యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడ ట్రాన్స్ ట్రాయ్ విషయంలోనే సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా సమాచారం.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్