కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి ఇవాళ సీబీఐ అధికారులు వెళ్లారు. రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి వచ్చారు.
కడప: వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి ఇంటికి బుధవారం నాడు సీబీఐ అధికారులు వెళ్లారు. రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు అవినాస్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఇవాళ ఉదయమే అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. ఈ నెల 23వ తేదీన పులివెందులలో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. అదే రోజున వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు రావాలని ఈ నొటీసులో పేర్కోన్నారు సీబీఐ అధికారులు. అయితే ముందుగా నిర్ధయించిన షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు.ఈ లేఖ ఆధారంగా ఇవాళ మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన విచారణకు రావాలని సీబీఐ ఆ నోటీసులో పేర్కొంది.
also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు
undefined
2019 మార్చి 19న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు . ఈ హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిర్వహిస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఏపీ రాష్ట్రం నుండి కాకుండా మరో రాష్ట్రానికి తరలించాలని వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది..ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఉన్నత న్యాయస్థానం తెలంగాణకు విచారణను బదిలీ చేసింది.