ఆయేషా హత్య కేసు: నాటి పోలీసులను విచారించిన సీబీఐ

By Siva KodatiFirst Published Apr 24, 2019, 8:17 PM IST
Highlights

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసి విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసి విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఆయేషా మీరా హత్య సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులను సీబీఐ అధికారులు విచారించారు.

నాడు పనిచేసిన కానిస్టేబుళ్లు రామారావు, శంకర్, రాధాలను ప్రశ్నించి వారి స్టేంట్‌మెంట్‌ను రికార్డు చేశారు. హత్య జరిగిన సమయంలో దర్యాప్తు జరిగిన తీరు, గుర్తించిన ఆధారాల గురించి ఆరా తీశారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఘటనాస్థలంలో దొరికిన ఆనవాళ్లపై సీబీఐ ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులు విజయవాడ కోర్టులో అనుమానాస్పదస్ధితిలో కాలిపోయాయి.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది. దీనిపై ఇప్పటికే సీబీఐ.. విజయవాడ కోర్టు సిబ్బందిపై రెండు కేసులు నమోదు చేసింది. హత్య జరిగి 12 సంవత్సరాలు గడుస్తున్నా ఈ కేసులో అసలు నిందితుడెవరో ఇంతవరకు తేలలేదు. 

click me!