వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: మరో ఇద్దరు అనుమానితుల విచారణ

Published : Jul 30, 2021, 03:18 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: మరో ఇద్దరు అనుమానితుల విచారణ

సారాంశం

  వివేకా హత్య కేసులో మరో ఇద్దరు అనుమానితులను సీబీఐ అధికారులు శుక్రవారం నాడు విచారిస్తున్నారు.సునీల్ బంధువులైన లోకేష్, గోవింద్ లను సీబీఐ విచారిస్తోంది. 54 రోజులుగా సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ చేస్తున్నారు.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం నాడు ఇద్దరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 54 రోజులుగా వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్  జమ్మలమడుగు  కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్, గోవింద్ లను ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు.

also read:వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు: రంగయ్య స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు

పులివెందులకు చెందిన సునీల్ యాదవ్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆ పిటిషన్ లో ఆయన ఆరోపించారు. సునీల్ బంధువు యువరాజ్ తో కలిసి సీబీఐ అధికారులు అనంతపురంలో విచారణ కూడ చేశారు. సునీల్ గతంలో అనంతపురంలో ఉన్నాడని సీబీఐ అధికారులు గుర్తించారు. సునీల్ బంధువులైన లోకేష్, గోవర్ధన్ లను కూడ ఇవాళ సీబీఐ విచారిస్తున్నారు.

వివేకానందరెడ్డి వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సహా ఆయన భార్యను  పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకి గురువారం నాడు వదిలిపెట్టారు.2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులను ఇంకా గుర్తించలేదు.


 

PREV
click me!

Recommended Stories

కదిరిలో రూ.25 కోట్ల అవినీతి | BJP Leader Vishnu Vardhan Reddy Demands Probe | Asianet News Telugu
Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu