YS Viveka Murder Case : మళ్లీ మొదలైన సీబీఐ విచారణ.. భరత్ కుమార్ యాదవ్ హాజరు..

Published : Dec 15, 2021, 01:55 PM IST
YS Viveka Murder Case : మళ్లీ మొదలైన సీబీఐ విచారణ.. భరత్ కుమార్ యాదవ్ హాజరు..

సారాంశం

వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ గత నెల 21న భరత్ కుమార్ సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. దీంతో పాటు మీడియా.. ముందుకు వచ్చి కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భరత్ కుమార్ ను సీబీఐ అధికారులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. 

కడప : మాజీమంత్రి YS Vivekanandareddy హత్య కేసులో సీబీఐ విచారణ.. దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మొదలైంది. కడపలోనే కేంద్ర కారాగారం అతిథి గృహంలో CBI officials విచారణ చేపట్టారు. విచారణకు పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ బంధువు Bharat Kumar Yadav హాజరయ్యారు. వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భరత్ కుమార్ ఆరోపణలు చేశారు. ఇతడిని సీబీఐ గతంలో చాలాసార్లు ప్రశ్నించినప్పటికీ తాజాగా మరోసారి ప్రశ్నిస్తుండటం గమనార్హం.

వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ గత నెల 21న భరత్ కుమార్ సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. దీంతో పాటు మీడియా.. ముందుకు వచ్చి కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భరత్ కుమార్ ను సీబీఐ అధికారులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నవంబర్ 16న డిమాండ్ చేశారు. సొంత బాబాయి అని కూడా చూడకుండా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు అన్ని విధాల సహకరించాడని ఆరోపణలు చేశారు. 

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకానంద రెడ్డి కూతురు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్ డాక్యుమెంట్ కాపీల్లోని వివరాలను ఆయన పేర్కొంటూ ఈ డిమాండ్ చేశారు.

YS Viveka Murder Case: దస్తగిరికి క్షమాభిక్ష... సిబిఐ నిర్ణయంపై హైకోర్టుకు గంగిరెడ్డి

దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలున్నాయని పట్టాభి తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్రా గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడని వివరించారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత దస్తగిరి సహా పలువురు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని, అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని హామీనిచ్చిట్టు శంకర్ రెడ్డి భరోసా ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నట్టు తెలిపారు. 

ఆ తర్వాత కూడా దస్తగిరి మరో కీలక విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లు రాజా రెడ్డి హాస్పిటల్‌లో రక్తపు మరకలను కడిగినట్టు వాంగ్మూలంలో చెప్పారని అన్నారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత పేరుతో ఉన్న రాజారెడ్డి హాస్పిటల్‌కే ఎందుకు వెళ్లారో చెప్పాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అక్కడైతే అందరూ తమ వారే ఉంటారు కాబట్టి.. భయపడాల్సిన పని ఉండదని అక్కడి వెళ్లినట్టే కదా అని పట్టాభి ఆరోపించారు.

కాగా, శంకర్ రెడ్డి మరెవరో కాదని, కడప ఎంపీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆప్తుడైన వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడని టీడీపీ నేత పట్టాభి అన్నారు. అంతేకాదు, వివేకా హత్య జరిగిన రోజు సంఘనా స్థలికి చేరుకుని సాక్ష్యాలను వీరిద్దరే అంటే అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలే తారుమారు చేశారని ఆరోపించారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్