పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: తొమ్మిది మంది మృతి

By narsimha lodeFirst Published Dec 15, 2021, 1:07 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెనికి సమీపంలోని జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది ఉన్నారు.

 ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. బుధవారం నాడు ఉదయం Ashwa raopetaనుండి jangareddygudem వైపునకు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.  బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని క్షతగాత్రులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు Rtc Bus డివైడర్ ను ఢీకొట్టిందని చెప్పారు.  ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. 

బస్సులో ఓవర్ లోడ్ వల్ల కూడా ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అదికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  జంగారెడ్డి గూడెనికి 10 కి.మీ దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకొంది. బస్సు అతి వేగంగా ఉన్న  సమయంలో వాగు వద్ద బస్సు అదుపు తప్పి ఎడమ వైపునకు ఒరిగిపోయింది. ఈ సమయంలోనే బస్సు అదుపు తప్పి  Jalleru వాగులో పడిపోయింది. బస్సు రెండు ముక్కలుగా విరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  ఈ ప్రమాదం గురించి తెలుసుకొన్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. బస్సు కింది బాగంలో కూడా ప్రయాణీకులు ఉండి ఉండొచ్చనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను పడవల సహాయంతో ఒడ్డుకు చేర్చుతున్నారు.

also read:నెల్లూరులో ఘోర ప్రమాదం : ఆటోను ఢీకొట్టిన లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణీకులు, గాలింపు

 బస్సు కంట్రోల్ తప్పి బస్సు జల్లేరు వాగులో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి రాజబాబునాయక్ తెలిపారు.  తాను ఆశ్వరావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్లేందుకు ఈ బస్సు ఎక్కానని ఆయన చెప్పారు. ఎదురుగా వాహనాలు కూడా ఏమీ లేవని ఆయన చెప్పారు.జల్లేరు వాగు వద్దకు వచ్చిన సమయంలో బస్సు ఎడమ వైపునకు తిరిగి వాగులో పడిపోయిందని ఆయన చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మరో వైపు కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి బస్సు జల్లేరు వాగులో పడిపోయిందని చెబుతున్నారు. 

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా సీఎం జగన్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. మరో వైపు బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. మృతుల కుటుంబాలకు మంత్రి నాని సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టుగా మంత్రి  పేర్ని నాని చెప్పారు.క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి తెలిపారు.క్షతగాత్రులకు మైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని మంత్రి వివరించారు.

బస్సు ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి

జల్లేరు వాగులో బస్సు ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. 


 

click me!