వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: ఎర్రగంగిరెడ్డి సహా నలుగురి విచారణ

By narsimha lodeFirst Published Jun 17, 2021, 4:52 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  గురువారం నాడు సీబీఐ విచారణ సాగించింది. 11 రోజులుగా ఈ హత్య కేసుపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. 

కడప:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  గురువారం నాడు సీబీఐ విచారణ సాగించింది. 11 రోజులుగా ఈ హత్య కేసుపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. 2019 మార్చి మాసంలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఇంట్లోనే ఉన్న వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యాడు. 

also read:వైఎస్ వివేకా హత్య కేసు: మరో ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ

పులివెందులకు చెందిన మైన్స్ యజమాని గంగాధర్ , వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన జగదీశ్వర్ రెడ్డి, ఓ మహిళను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను తారుమారు చేశారనే కేసులో గంగిరెడ్డి అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై వచ్చిన గంగిరెడ్డిని సీబీఐ విచారిస్తోంది. 

సుంకేసులకు చెందిన జగదీశ్వర్ రెడ్డి వివేకానందరెడ్డికి చెందిన వ్యవసాయ పనులను చూసేవారు. అంతేకాదు వివేకాను ఆయన ప్రతి రోజూ కలిసేవాడు. వివేకా  బాగోగులు కూడ చూసేవాడు.వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు జగదీశ్వర్ రెడ్డి ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకొన్నాడు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. 
 

click me!