ఇదే లాస్ట్ ఛాయిస్... జగన్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు

By Arun Kumar P  |  First Published May 26, 2021, 12:16 PM IST

బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ పై కౌంట‌ర్ దాఖ‌లుకు జగన్ తరను న్యాయవాదులు మ‌రింత గ‌డువుకోరడంతో విచారణను జూన్ 1కి వాయిదా వేసింది న్యాయస్థానం. 


అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్ పై ఇవాళ(బుధవారం) సిబిఐ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంట‌ర్ దాఖ‌లుకు జగన్ తరను న్యాయవాదులు మ‌రింత గ‌డువుకోరడంతో విచారణను జూన్ 1కి వాయిదా వేసింది న్యాయస్థానం. 

లాక్‌డౌన్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేకపోతున్నామని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు న్యాయస్థానానికి తెలిపారు. ఈ క్రమంలో చివరిసారిగా జూన్ 1వ తేదీవనకు గడువు ఇస్తున్నట్లు... అప్పట్లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే నేరుగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని సీబీఐ కోర్టు తెలిపింది.  

Latest Videos

read more  బెయిల్ రద్దు పిటిషన్... జగన్ కు సిబిఐ కోర్టు నోటీసులు

ఈ బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు సిబిఐ కోర్టు ఏపీ సీఎం జగన్, సీబీఐను ఆదేశించింది. మే 7న విచారణ జరిగిన సమయంలో కౌంటర్ దాఖలుకు సమయం కోరిన జగన్, మే 17న కూడా మరోసారి గడువు కోరారు. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అయితే ఇవాళ కూడా మరింత సమయం కావాలని కోరడంతో కాస్త అసహనం వ్యక్తం చేసిన జూన్ 1వ తేదీవరకు న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. 

 జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆయన బెయిల్ ను రద్ద చేయాలంటూ రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే గత ఏడాదిలో  పార్టీ వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతున్నందున రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వేటేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కూడ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 27న ఏపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

 

click me!