వైఎస్ వివేకా హత్య కేసు .. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్ట్‌ సమన్లు

Siva Kodati |  
Published : Jul 14, 2023, 05:54 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు .. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్ట్‌ సమన్లు

సారాంశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్ట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది.  ఆగస్ట్ 14న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్ట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 14న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్ట్ పరిగణనలోనికి తీసుకుంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా పేర్కొంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్