పశ్చిమగోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 18,93,354కి చేరిక

By narsimha lode  |  First Published Jul 1, 2021, 5:07 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 90,574 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3,841 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,93,354కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,744కి చేరింది.



అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 90,574 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3,841 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,93,354కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,744కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 3,963మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 42 వేల 432 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 38,178 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,20,84,192 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

Latest Videos

గత 24 గంటల్లో అనంతపురంలో141,చిత్తూరులో 616, తూర్పుగోదావరిలో760, గుంటూరులో313,కడపలో 171, కృష్ణాలో350, కర్నూల్ లో045, నెల్లూరులో263, ప్రకాశంలో 296,విశాఖపట్టణంలో 163, శ్రీకాకుళంలో113, విజయనగరంలో 108 పశ్చిమగోదావరిలో 504కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  38 మంది చనిపోయారు. చిత్తూరు,తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఐదుగురి చొప్పున మృతి చెందారు.శ్రీకాకుళం, పశ్చిమగోదావరిజిల్లాల్లో ముగ్గురి చొప్పున చనిపోయారు. అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ఇద్దరి చొప్పున మృతి చెందారు.కర్నూల్, నెల్లూరు, విశాఖట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు.దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,744 కి చేరింది.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,54,098, మరణాలు 1050
చిత్తూరు-2,20,452, మరణాలు1613
తూర్పుగోదావరి-2,63,730, మరణాలు 1136
గుంటూరు -1,62,627,మరణాలు 1095
కడప -1,06,624, మరణాలు 607
కృష్ణా -1,01,918,మరణాలు 1122
కర్నూల్ - 1,21,966,మరణాలు 819
నెల్లూరు -1,27,580,మరణాలు 909
ప్రకాశం -1,21,564, మరణాలు 919
శ్రీకాకుళం-1,18,607, మరణాలు 713
విశాఖపట్టణం -1,48,785, మరణాలు 1053
విజయనగరం -80,309, మరణాలు 659
పశ్చిమగోదావరి-1,62,199, మరణాలు 1029

 

: 01/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,90,459 పాజిటివ్ కేసు లకు గాను
*18,39,537 మంది డిశ్చార్జ్ కాగా
*12,744 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 38,178 pic.twitter.com/ii0SYssG3A

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!