ఉద్యోగాల భర్తీకి జగన్ కీలక ఆదేశాలు... అన్ని క్యాలెండర్‌లోనే

By Siva KodatiFirst Published Mar 25, 2021, 8:27 PM IST
Highlights

ఏపీలో పోస్టుల భర్తీకి కీలక ఆదేశాలిచ్చారు సీఎం జగన్. ఈ ఏడాది భర్తీ చేసే పోస్టుల క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది 6000 మంది పోలీస్ నియామకాలు జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఏపీలో పోస్టుల భర్తీకి కీలక ఆదేశాలిచ్చారు సీఎం జగన్. ఈ ఏడాది భర్తీ చేసే పోస్టుల క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది 6000 మంది పోలీస్ నియామకాలు జరపాలని సీఎం జగన్ ఆదేశించారు.

అటు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనపై సీఎం సమీక్ష చేశారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయనున్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ కానుంది. దీని ద్వారా దాదాపు పది లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి కలగబోతోంది. 

అంతకుముందు విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సొంతంగా ప్రశ్నాపత్రాలు  తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు జేఎన్టీయూ ప్రశ్నాపత్రాలే ఉండాలని తెలిపింది. వాల్యుయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేరని .. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలి ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ప్రతికోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించామని.. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలని సీఎం అన్నారు.

కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని, ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

click me!