జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ.. అక్టోబర్ 7కి వాయిదా

By Siva Kodati  |  First Published Sep 30, 2021, 9:10 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై గురువారం సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. రాంకీ ఫార్మా ఈడీ చార్జిషీట్‌పై ఈ సందర్భంగా సీబీఐ కోర్టు విచారించింది. రాంకీ, జగతి పబ్లికేషన్స్‌, వాన్‌పిక్, దాల్మియా, అరబిందో-హెటిరో సీబీఐ కేసుల విచారణ అక్టోబర్‌ 7కి కోర్టు వాయిదా వేసింది


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై గురువారం సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. రాంకీ ఫార్మా ఈడీ చార్జిషీట్‌పై ఈ సందర్భంగా సీబీఐ కోర్టు విచారించింది. రాంకీ కేసులో ఎంపీ అయోధ్య రామిరెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ ఈడీ కేసు నుంచి తొలగించాలని అయోధ్య రామిరెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు జగన్, విజయసాయి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు ఈడీ గడువు కోరింది. రాంకీ, జగతి పబ్లికేషన్స్‌, వాన్‌పిక్, దాల్మియా, అరబిందో-హెటిరో సీబీఐ కేసుల విచారణ అక్టోబర్‌ 7కి కోర్టు వాయిదా వేసింది. అలాగే దాల్మియాలో ఈశ్వర్ సిమెంట్స్ విలీనంపై వివరాలు తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

click me!