కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పై డోన్ లో కేసు

By telugu teamFirst Published Feb 3, 2020, 12:18 PM IST
Highlights

కల్తీ మద్యం కేసులో కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ ను 26వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు కేఈ కృష్ణమూర్తి ఎపీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పై కర్నూలు జిల్లాలోని డోన్ లో కేసు నమోదైంది. కల్తీ మద్యం వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన 26వ నిందితుడిగా ఉన్నాడు.

కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటికే 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే, కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామం లో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. 

ఉప్పరి రాంబాబు, నాగభూషణం,డోన్ ఇంద్రనగర్ వాసి రవి వీరిని ఇంతకు ముందు అరెస్టు చేశారు. డోన్ మండలం ఉడుములపాడు కేంద్రంగా ఉప్పరి రాంబాబు కల్తీ మద్యం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!