కరోనాను అరికట్టలేక ప్రత్యర్ధులపై కేసులు: జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శలు

By Siva KodatiFirst Published May 9, 2021, 10:30 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పుడు కేసులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అచ్చెన్నాయుడు తెలిపారు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పుడు కేసులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

కరోనా సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా.. పంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై  వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:చంద్రబాబుపై కేసు.. టీడీపీ కౌంటర్, ఎన్ 440 కేపై మంత్రే చెప్పారంటూ ఫిర్యాదు

కరోనా అరికట్టడం చేతగాక ప్రత్యర్థులపై జగన్ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమాపై కూడా అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కూడా అనంతపురంలో తప్పుడు కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

click me!