పెళ్లికి వెడుతుంటే.. అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి...

Published : Jun 08, 2022, 02:04 PM IST
పెళ్లికి వెడుతుంటే.. అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి...

సారాంశం

కృష్ణాజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెడుతున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 

కృష్ణా జిల్లా : Krishna Districtలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం అంబాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి Culvertను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విజయనగరం వస్తున్న సమయంలో accident జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులుAccident siteను పరిశీలించారు.  

dead bodyలను కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో వేడుక జరిగే ప్రదేశానికి చేరుకుంటారని అనుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. 

కాగా, మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని రెంట చింతలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కుటుంబసభ్యులతో వారంతా శివుడి దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో వారంతా సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దుల్లోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారి ఇంటి వద్ద దిగి పోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. నెత్తురోడుతూ హాహాకారాలు..  చిమ్మ చీకట్లో రక్షించండి.. అని ఆర్తనాదాలు.. ఆదివారం అర్ధరాత్రి రెంటచింతల రహదారి ఈ భయానక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. 

రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరుకు రవాణా చేసే టాటా ఏస్ వాహనంతో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న వీరి వాహనం రెంటచింతల  పొలిమేరలోకి రాగానే  స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. వాహనం పల్టీలు కొట్టడంతో  అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు.

ప్రమాదానికి కారణం అదే..
మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ ప్రవహిస్తుంది.  ఇక్కడ స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు అక్కడే ఆగి ఉన్న వాహనాలు కనిపించవు. దీంతో రహదారిపై ప్రయాణం చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.  కానీ వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ నిత్యం తిరిగే రహదారి అనే నిర్లక్ష్యంతో వేగంగా దూసుకెళ్ళాడు.  రహదారిపై ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. క్షతగాత్రులను 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, తీవ్ర గాయాలైన మరో ఇద్దరు గురజాల ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులు అందరిని  గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్