తెల్లారితే పెళ్లి... చీరమార్చుకుంటానని గదిలోకి వెళ్లి.. వరుడికి షాక్ ఇచ్చిన వధువు...

Published : Jun 08, 2022, 12:42 PM IST
తెల్లారితే పెళ్లి... చీరమార్చుకుంటానని గదిలోకి వెళ్లి.. వరుడికి షాక్ ఇచ్చిన వధువు...

సారాంశం

పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లారితే పెళ్లి అనగా ఆ యువతి చేసిన పనితో కుటుంబం మొత్తం షాక్ లో ఉంది.  

ద్వారకా తిరుమల : తెల్లారితే పెళ్లి పీటల మీదకు ఎక్కాల్సిన యువతి మెడకు ఉరితాడు బిగించుకుంది. ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరొకరితో marriage కుదుర్చడంతో మనస్తాపానికి గురై suicide చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంటకు చెందిన యువతి (24) డిగ్రి చదివి ఇంటివద్దే ఉంటోంది. ఈమె కొంతకాలంగా ఓ వ్యక్తికి ప్రేమిస్తోంది. 

కుటుంబ సభ్యులు జంగారెడ్డి గూడెం లక్కవరానికి చెందిన మరొకరితో వివాహం కుదిర్చారు. బుధవారం పెళ్లి జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. యువతి మంగళవారం రాత్రి చీర మార్చుకుంటానని గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఉరేసుకుంది. ఆమె ఎంత సేపటికీ రాకపోయేసరికి కుటుంబసభ్యులు తలుపులు గడి పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీని మీద తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, మే 26వ తేదీన ఇలాంటి ఘటనే కర్ణాటక లో జరిగింది. తెల్లారితే పెళ్లి..  కుటుంబ సభ్యులు, బంధువులతో ఇల్లంతా కళకళలాడుతోంది. పెళ్లితో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న వరుడికి.. ఇంటి సభ్యులకు వధువు ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రే  తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి elope అయ్యింది. 

వివరాల ప్రకారం..  బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విదురాశ్వత్థం చన్నరాయస్వామి కల్యాణమండపంలో వివాహం జరగాల్సి ఉండగా ఆ పెళ్లి నిలిచిపోయింది. వధువు పరారు కావడమే ఇందుకు కారణం. నగర శివారులోని నాగిరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22),  కరేకల్లహళ్లివాసి సురేష్ కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం రాత్రి నిబ్బళం జరిపించారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు.

ఇదే అదనుగా ఆ వధువు అప్పిరెడ్డిహళ్లికి చెందిన తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్ (25)తో గుట్టు చప్పుడు కాకుండా పరారైంది. ఉదయం లేచి చూసేసరికి వధువు లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం ముందే చెప్పి ఉంటే మేనమామతోనే పెళ్లి చేసే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెళ్ళికొడుకు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు