పర్యటనకు ముందే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాజధాని రైతుల నుండి నిరసనను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అమరావతి: పర్యటనకు ముందే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాజధాని రైతుల నుండి నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పిన తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబునాయుడును రైతులు కోరుతున్నారు.
Also read:సుజనాకి కౌంటర్: బ్యాంకు లూటీల భజన చౌదరి అంటూ రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి
ఈ నెల 28వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల తీరు తెన్నులను చంద్రబాబునాయుడు పరిశీలించనున్నారు. రాజధాని విషయంలో తాజాగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలను సేకరిస్తోంది.
ఈ తరుణంలో అమరావతిలో చంద్రబాబునాయుడు పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే చంద్రబాబుపై రైతులు విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను అమలు విషయమై రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ కుటుంబాల నుంచి 300 ఎకరాలు రాజధాని అభివృద్ధి కోసం భూమిని ఇచ్చినట్టుగా చంద్రబాబునాయుడుకు రైతులు గుర్తు చేస్తున్నారు. రైతు అభిప్రాయ సేకరణ సభను రభస సృష్టించి తమ మీద కేసులు పెట్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చుట్టూ తిరిగి తమకు ఎలాంటి న్యాయం చేయలేదని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజధాని నిర్మిస్తున్నామనే పేరుతో తమకు గ్రాఫిక్స్ బొమ్మలు చూపించారని రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత మూడేళ్ళలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేపట్టారు. ఒక్క .ఒక్క శాశ్వత కట్టడ నిర్మాణం జరగలేదో చెప్పాలని రైతులు ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో తాము మోసపోయినట్టుగా రైతులు అభిప్రాయపడ్డారు. ఉచిత వైద్యం, విద్య, ప్లాట్ల పంపిణీ పెద్ద గోల్‌మాల్ జరిగిందని రైతులు ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ కమీషన్ల కక్కర్తి వలనే రోడ్లు,ఇతర కన్ స్ట్రక్షన్స్ అన్నీ అసంపూర్ణంగా జరిగాయని రైతులు ఆరోపించారు.
రాజదాని అభివృద్ధి విషయంలో చంద్రబాబు, లొకేష్, నారాయణ కు ఎంతెంత కమిషన్లు అందాయో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధానికి భూములు వైసిపి నేతలు ఇచ్చారే తప్ప టిడిపి నేతలు వాళ్ళు భూములివ్వలేదన్నారు. రాజధానిలో 9 వేల ఎకరాలు గత టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నారని రైతులు ఆరోపించారు.
తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు హోల్డ్ లో ఎందుకు పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలని రైతులు కోరారు. రైతులకు సమాధానం చెప్పకుండా రాజధాని లో పర్యటిస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు.
చంద్రబాబు రాజధానిలో పర్యటించాలంటే దళితులకు క్షమాపణ చెప్పాల్సిందే....లేదంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు 28 న రాజధాని ప్రాంతానికి రావొద్దని సూచించారు.