ఈ నెల 27న ఏపీ కేబినెట్ భేటీ: కొత్త బార్ పాలసీకి గ్రీన్‌ సిగ్నల్

Published : Nov 25, 2019, 12:40 PM ISTUpdated : Nov 25, 2019, 12:49 PM IST
ఈ నెల 27న ఏపీ కేబినెట్ భేటీ: కొత్త బార్ పాలసీకి గ్రీన్‌ సిగ్నల్

సారాంశం

ఏపీ రాష్ట్రంలో నూతన బార్ పాలసీపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చర్చించనుంది. ఈ మేరకు ఈ నెల 27వ తదేీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 


అమరావతి:  వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో  ఈ నెల 27వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలకమైన అంశాలపై కేబినెట్ చర్చించనుంది.

వచ్చే నెల 9వ తేదీ నుండి  ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాల్సిన కీలక బిల్లులపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కూడ కేబినెట్‌లో చర్చించనున్నారు. కొత్త బార్ల పాలసీకి కూడ ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో మైనింగ్ లీజుల రద్దుపై నిర్ణయం కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. 

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలను చేస్తోంది.ఏపీ సర్కార్ ఇటీవల తీసుకొన్న నిర్ణయాలపై  కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?