బాబుతో రాహుల్ దోస్తీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు మరో నేత గుడ్ బై

Published : Nov 03, 2018, 10:28 AM IST
బాబుతో రాహుల్ దోస్తీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు మరో నేత గుడ్ బై

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేతులు కలపడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి రాజీనామాలుచ చేసే దిశలో సాగుతున్నారు.

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేతులు కలపడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి రాజీనామాలుచ చేసే దిశలో సాగుతున్నారు.

తాజాగా సి. రామచంద్రయ్య కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. కాసేపట్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే.

గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన రామచంద్రయ్య చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో సి. రామచంద్రయ్య కూడా కాంగ్రెసులో కొనసాగారు. చిరంజీవికి సి. రామచంద్రయ్య అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే