బర్త్ డే పార్టీ అని చెప్పి తీసుకువెళ్లి...

Published : Nov 03, 2018, 10:02 AM IST
బర్త్ డే పార్టీ అని చెప్పి తీసుకువెళ్లి...

సారాంశం

బర్త్ డే పార్టీ అని చెప్పి తీసుకువెళ్లి... ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారినికి పాల్పడిన సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

బర్త్ డే పార్టీ అని చెప్పి తీసుకువెళ్లి... ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారినికి పాల్పడిన సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలోని కంచరపాలెం, కప్పరాడ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు, నలుగురు యువతులు తమ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి ద్విచక్రవాహనాలపై వెళ్లారు. పార్టీలో బాగా ఎంజాయ్ చేసి.. గురువారం సాయంత్రం అవే ద్విచక్రవాహనాలపై వెనుదిరిగారు.

అయితే.. వారి వాహనాలు శొంఠ్యాం సమీపంలోని ఓ కళాశాలకు వచ్చేసరిగా.. ఆ ఆరుగురు యువకుల్లో ఇద్దరు యువకులు వారితో వచ్చిన ఓ యువతిని బలవంతంగా లాక్కెళ్లి.. అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలిపెట్టినట్లు సమాచారం.

కాగా.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.నిందితులు మణి, వెంకట్ లుగా గుర్తించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు