జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు , శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి. ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా తనను ఎవరూ పట్టించుకోకపోవడంతోనే పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బైరెడ్డి ఫైర్ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు , శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా తనను ఎవరూ పట్టించుకోకపోవడంతోనే పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బైరెడ్డి ఫైర్ అయ్యారు.
రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత వ్యాఖ్యలు సరికావన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని బైరెడ్డి నిలదీశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనకు ఓటేయ్యాలని రాష్ట్రంలో ఎవరికి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పనైపోయిందని.. అలాంటి పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తుల కోసం పాకులాడుతున్నారని సిద్ధార్ రెడ్డి చురకలంటించారు.
Also Read : ఉనికి కోసమే వ్యాఖ్యలు.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రారు.. వాళ్లకూ తెలుసు : ప్రసన్నకుమార్ రెడ్డి
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్మక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సింహాన్ని ఎదుర్కొనేందుకు గంట నక్కలు, ఊరకుక్కలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌లకు అసలు ఏపీలో ఆధార్, సొంతిల్లు వుందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో వుంటూ ఆంధ్రప్రదేశ్‌పై విషం కక్కుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.
దమ్ము, ఖలేజా వుంటే సింగిల్‌గా పోటీ చేయాలని చంద్రబాబు, పవన్‌లకు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎన్నికలకు నక్కలు , కుక్కలు, పందులు కలిసి వస్తాయని.. కానీ సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగురవేస్తామని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.