‘క్యాసినోలో డీజీపీ వాటా ఎంత?.. అలా చేస్తే కొడాలి నాని శవాన్ని పంపుతాం’.. బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్

Published : Jan 24, 2022, 12:23 PM IST
‘క్యాసినోలో డీజీపీ వాటా ఎంత?.. అలా చేస్తే కొడాలి నాని శవాన్ని పంపుతాం’.. బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్

సారాంశం

గుడివాడ‌లో క్యాసినో వ్యవహారానికి (Gudivada casino Issue) సంబంధించి టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (buddha venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు ఇంటి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతామని అన్నారు.   

గుడివాడ‌లో క్యాసినో వ్యవహారం (Gudivada casino Issue) ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌లో కేసినో నిర్వహించారని.. ఇందుకు సంబంధించి ఆధారాలు అన్ని ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక, తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (buddha venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతామని బుద్దా వెంకన్న అన్నారు. Kodali Naniకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని చెప్పారు. కొడాలి నాని వంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అని అన్నారు. 

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అర గంటల్లో ప్రజలు కొడాలి నానిని చంపుతారని బుద్దా వెంకన్న కామెంట్ చేశారు. కొడాలి నానికి దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని.. తేల్చుకుందాం అంటూ సవాలు విసిరారు. కొడాలి నాని వాడుతున్న భాష ఏంటని ప్రశ్నించారు. అసలు ఆయన చరిత్ర ఏంటని ప్రశ్నలు సంధించారు. క్యాసినో‌లో రూ. 250 కోట్లు చేతులు మారాయి అని బుద్దా వెంకన్న ఆరోపించారు. అందులో డీజీపీ వాటా ఎంత..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇక, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న కొడాలి నాని (kodali nani) సంక్రాంతి పండగ (sankranti festival) సందర్భంగా అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలను ఏర్పాటు చేసారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ గుడివాడ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని కే కన్వెన్షన్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతల పర్యటన సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

ఇదిలా ఉంటే కొడాలని నాని మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన ఫంక్షన్ హాల్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని... జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని సవాల్ చేశారు. అయితే ఈ సవాలుకు టీడీపీ నేతలు కూడా సై అంటున్నారు. కొడాలి నాని దమ్ముంటే తేల్చుకుందామంటూ తిరిగి సవాలు విసిరుతున్నారు. కొడాలి నాని ఫంక్షన్ హాల్‌లో క్యాసినో జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయిని చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu