మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించాలని టిడిపి పేత బుద్దా వెంకన్న డిమాండ్ చేసారు.
విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ నాయకులు స్పందించకపోవడంతో బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో చాలామంది నాయకులకు చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టారని... వారిలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలుగా వున్నారన్నారు. అలాంటివారు కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ సీఎం, మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని... అరెస్ట్ ను ఖండించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేసారు.
హైదరాబాద్ లో ఐటీ అభివృద్దికి చంద్రబాబు పుణ్యమేనని మంత్రి కేటీఆర్ చాలాసార్లు చెప్పారని వెంకన్న గుర్తుచేసారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెడితే స్పందించాల్సిన కనీస బాధ్యత తెలంగాణ నాయకులపై వుందన్నారు వెంకన్న.
ఇక వైసిపి నాయకులపైనా బుద్దా వెంకన్న సీనియస్ అయ్యారు. ఏపీలోనూ కొడాలి నాని వంటివారికి టిడిపి రాజకీయ జన్మనిచ్చిందని... అలాంటివారే ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. కేవలం తన నీచ రాజకియాలు కోసమే నాని టిడిపిని, చంద్రబాబును తిడుతున్నాడని అన్నారు. తనకు రాజకీయ బిక్ష పెట్టింది హరికృష్ణ అంటున్నావే... మరి ఆయన పార్టీ పెట్టినపుడు అందులోకి ఎందుకు వెళ్లలేదు? అని కొడాలి నానిని వెంకన్న ప్రశ్నించారు.
Read More రింగు రోడ్డు లేదు బొంగురోడ్డు లేదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. : టీడీపీ
ఇక మరో మంత్రి పేర్ని నానిపైనా బుద్దా ఫైర్ అయ్యారు. నేను నోరు విప్పితే రోడ్డు మీద నడవలేవు... అయినా నీ బతుకు ఎవరికి తెలియదు అంటూ పేర్ని నానిపై విరుచుకుపడ్డారు. 2024లో టిడిపి అధికారంలోకి రాగానే ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైసిపి నాయకుల పని పడతామని హెచ్చరించారు. పిచ్చికుక్కల బండిపై బెంబి సర్కిల్ వరకు లాక్కెళ్లి మొకాళ్లపై దండం పెట్టిస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
వీడియో
ఏపిలో రెండు చట్టాలు అమలవుతున్నాయని... ఒకటి రాజ్యాంగ చట్టమైతే మరోటి జగన్ రెడ్డి చట్టమని వెంకన్న ఉన్నాయి. టిడిపి వాళ్లు చేస్తే తప్పు ... అదే వైసిపి వాళ్ళు చేస్తే తప్పు కాదు... ఇదేకదా ఏపీలో జరుగుతోంది అని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేసుకునే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను వైసిపి వాళ్లు నానా మాటలు అంటున్నారని... ఇదేమీ తప్పు కాదట... మా నాయకులు రోజా గురించి మాట్లాడితే మాత్రం జైల్లో పెడుతున్నారని వెంకన్న అన్నారు.
ఇక ఏపీలోని పేద వర్గాలకు అమ్మఒడి పథకం వద్దంటూ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి పథకాలిచ్చే బదులు ఉద్యోగాలిచ్చి వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చూడాలని...అప్పుడే వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు. అమ్మవడిలాంటి పథకాలతో వచ్చే డబ్బులతో వైన్ షాపులకు వెళ్ళి మద్యం సేవిస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు.
పురాణాల్లో కూడా లేని రాక్షసులు జగన్ రెడ్డిలో కనిపిస్తున్నారని అన్నారు. ఓ సైకో రెడ్డి ఆదేశాలను పాటిస్తూ పోలీసులు కూడా తప్పు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వమే నిరంతరం ఉండదు... పోలీసులు ఇది గమనించి నడుచుకోవాలని బుద్దా వెంకన్న హెచ్చరించారు.