విజయసాయికి జన్మదిన శుభాకాంక్షలు...మీ నుండి కోరుకునేది అదొక్కటే: బుద్దా వెంకన్న

Arun Kumar P   | Asianet News
Published : Jul 01, 2020, 11:44 AM ISTUpdated : Jul 01, 2020, 11:55 AM IST
విజయసాయికి జన్మదిన శుభాకాంక్షలు...మీ నుండి కోరుకునేది అదొక్కటే: బుద్దా వెంకన్న

సారాంశం

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వ్యంగ్యంగా విషెస్ తెలిపారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.

గుంటూరు: వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వ్యంగ్యంగా విషెస్ తెలిపారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 108 అంబులెన్స్ ల నిర్వహణలో రూ. 307 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది.  ఈ నేపథ్యంలో 108 ప్రారంభోత్సవం విజయసాయి రెడ్డి పుట్టినరోజునే జరగడంపై స్పందిస్తూ వెంకన్న ట్వీట్లు చేశారు. 

''300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా?  ఇప్పటికైనా ఆలస్యం కాదు మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ విజయసాయి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే సైటైర్లు విసిరారు. 

read more  విజయసాయిరెడ్డి పాత్ర:108 అంబులెన్స్‌ల్లో రూ.307 కోట్ల స్కాంపై టీడీపీ సంచలనం

108, 104 అంబులెన్స్ ల వ్యవహారంలో విజయసాయి రెడ్డి భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అలాంటిది ఆయన పుట్టినరోజునే వీటిని ప్రారంభించడంతో టిడిపి నాయకులు మరింతగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.  ఇదే విషయంపై మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.  

''300 కోట్ల ప్రజాధనంతో ఘనంగా సాయి రెడ్డి గారి జన్మదినం. ఏ2  గారి జన్మదినోత్సవం సందర్బంగా 300 కోట్ల స్కామ్ 108 ని ఏ1 జగన్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇచ్చారు. అప్రూవర్ గా మారకుండా ఉండటానికి ఆ మాత్రం సమర్పించుకోకపోతే ఎలా!'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే