హంద్రీ నది ఒడ్డున దారుణ హత్య, ఆపై డెడ్‌బాడీకి నిప్పు... పరువు హత్యగా అనుమానం..?

Siva Kodati |  
Published : Dec 24, 2022, 05:10 PM IST
హంద్రీ నది ఒడ్డున దారుణ హత్య, ఆపై డెడ్‌బాడీకి నిప్పు... పరువు హత్యగా అనుమానం..?

సారాంశం

కర్నూలు నగరంలోని హంద్రీనది ఒడ్డున ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆపై మృతదేహానికి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే దీనిని పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

కర్నూలులో దారుణహత్య జరిగింది. హంద్రీనది ఒడ్డున ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహానికి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం అందుకున్న పోలీసులు .. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లు ఆధారాల కోసం గాలిస్తున్నాయి. మృతుడిని ఆమోస్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆమోస్ ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరువు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే