2024 తర్వాత జగన్ అధికారం పోతుంది.. అప్పుడు ఏపీలోనే ఉంటారనే గ్యారెంటీ ఏముంది?: ఎంపీ జీవీఎల్

By Sumanth KanukulaFirst Published Dec 24, 2022, 4:47 PM IST
Highlights

ఐటీ రంగ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.1 శాతంగా ఉందని బీజేపీ ఎంపీ  జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఏపీకి చెందిన తమ ట్యాలెంట్‌తో ఐటీ రంగంలో రాణిస్తుంటే.. ఐటీ ఉత్పత్తుల్లో మాత్రం ఏపీ ఎక్కడా కనిపించడం  లేదన్నారు. 

ఐటీ రంగ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.1 శాతంగా ఉందని బీజేపీ ఎంపీ  జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఏపీకి చెందిన తమ ట్యాలెంట్‌తో ఐటీ రంగంలో రాణిస్తుంటే.. ఐటీ ఉత్పత్తుల్లో మాత్రం ఏపీ ఎక్కడా కనిపించడం  లేదన్నారు. ఐటీ రంగంలో ఉన్నవాళ్లను తరిమేయాలనే ఆలోచన తప్పితే.. వైసీపీ ప్రభుత్వం కొత్త కంపెనీలు తెచ్చి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌‌ను ఐటీ రంగంలో అభివృద్ది చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో ఏపీలో ఐటీ రంగం అభివృద్ది కోసం ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నారని.. అధికారం లేకపోతే హైదరాబాద్‌లో ఉంటున్నారని.. చంద్రబాబు, జగన్‌లు ఇదే బాటను అనుసరిస్తున్నారని విమర్శించారు. 

నిన్న సీఎం జగన్ మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటానని కొత్త డైలాగ్‌లు కొట్టారని.. అమరావతి విషయంలో కూడా సీఎం జగన్ ఇలానే చెప్పారని అన్నారు. గతంలో సీఎం జగన్ అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారని.. ఆ మాటకు ఆయన కట్టుబడి లేరని విమర్శించారు. 2024లో జగన్ అధికారం చేజారబోతుందని.. అప్పుడు జగన్ ఏపీలోనే ఉంటారనే గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. మాటలపై నమ్మకాలు లేవని.. అందుకు సీఎం జగన్ లిఖితపూర్వకంగా ఏమైనా భరోసా ఇస్తారా? అని ప్రశ్నించారు. 

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తున్నా రాష్ట్రంలో సుపరిపాలన లేదని విమర్శించారు. వైసీపీ,టీడీపీ సొంత వ్యాపారాల కోసం పరిపాలనను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ది కోసం కృషి చేస్తుందని అన్నారు. 

click me!