గంటల్లో పెళ్లి: వధువుకు షాకిచ్చిన వరుడు, పెళ్లికూతురు ఏం చేసిందంటే?

Published : Aug 31, 2018, 05:17 PM ISTUpdated : Sep 09, 2018, 01:20 PM IST
గంటల్లో పెళ్లి: వధువుకు షాకిచ్చిన వరుడు, పెళ్లికూతురు ఏం చేసిందంటే?

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి... కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా తనకు పెళ్లి ఇష్టం లేదని  వధువు కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన  యువతి ఆత్మహత్య  చేసుకొంది

అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి... కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా తనకు పెళ్లి ఇష్టం లేదని  వధువు కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన  యువతి ఆత్మహత్య  చేసుకొంది. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామానికి చెందిన మీనాక్షి అనే యువతి గురువారం నాడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. చియ్యేడు గ్రామానికి చెందిన మల్లేష్, లింగమ్మ దంపతులు చివరి సంతానం మీనాక్షి. మీనాక్షి పదో తరగతి వరకు చదువుకొంది.  ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటుంది.

నాలుగేళ్లుగా సమీప బంధువు  నబయన్న, నారాయణమ్మల కొడుకు దుర్గమప్ప... మీనాక్షిని ప్చరేమిస్తున్నాడు.  వీరిద్దరి ప్రేమ విషయం ఇటీవలనే  ఇరు కుటుంబాలకు తెలిసింది.

దీంతో  మీనాక్షిని పెళ్లి చేసుకొంటానని దుర్గమప్ప ఒప్పుకొన్నాడు. దీంతో  ఆగష్టు 30 వ తేదీన అహోబిళంలో  వివాహం చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి.  దీంతో మీనాక్షి కుటుంబసభ్యులు వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆగష్టు 29వ తేదీ రాత్రి పూట దుర్గమప్ప  ప్రియురాలి ఇంటికి వచ్చి తనకు పెళ్లి ఇష్టం లేదని  తేల్చి చెప్పేశాడు. దీంతో మీనాక్షి కుటుంబసభ్యులు  తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

కొన్ని గంటల్లోనే  వివాహం జరగాల్సి ఉండగానే  పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురైన మీనాక్షి విషం తాగింది. మరో వైపు తాను చనిపోననే భయంతో ఉరేసుకొంది. దీంతో ఆమె మృత్యువాత పడింది.  మీనాక్షి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు ప్రియుడుతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేర్లను రాసి తన చావుకు వాళ్లే కారణమని మీనాక్షి సూసైడ్ లెటర్ రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu