బ్రహ్మంగారి పీఠం వారసుడి ఎంపికపై వివాదం: మరోసారి గ్రామానికి పీఠాధిపతులు, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Jun 13, 2021, 9:33 AM IST
Highlights

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్రహ్మంగారి పీఠానికి వారసుల ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదం చోటు చేసుకొంది.

కడప: కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్రహ్మంగారి పీఠానికి వారసుల ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పీఠాధిపతుల రాకను వీరభోగ వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

also read:బ్రహ్మంగారి మఠంలో వివాదం: కందిమల్లాయపల్లి గ్రామస్తులతో 14 మంది పీఠాధిపతులు చర్చలు

బ్రహ్మంగారి పీఠం వద్దకు పీఠాధిపతులు రావడాన్ని  వ్యతిరేకిస్తూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కి ఆమె లేఖ రాశారు.  పీఠాధిపతులు వీరబోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కొడుకుకు మద్దతిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నెల 2,3 తేదీల్లో  14 పీఠాధిపతులు గ్రామాన్ని సందర్శించారు. పీఠాధిపతి ఎంపిక కోసం కుటుంబసభ్యులతో చర్చించారు. పీఠాధిపతి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి పీఠాధిపతులు  కందిమల్లాయపల్లికి చేరుకొన్నారు.

ఈ గ్రామస్తులు వీరభోగవెంకటేశ్వరస్వామి మొదటి భార్య కొడుకు వైపే మొగ్గు చూపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. బ్రహ్మంగారి మఠం ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించాడు. నూతన పీఠాధిపతి ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఇటీవలే మరణించిన వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగు కొడుకులు, నలుగురు కూతుళ్లు, రెండో భార్యకు ఇద్దరు కొడుకులున్నారు.

పీఠాధిపతి పదవి తనకే కావాలని పెద్ద భార్య  చంద్రావతమ్మ కొడుకు కోరుతున్నాడు.  ఈ పదవిని తన కొడుకుకు ఇవ్వాలని వసంత వెంకటేశ్వరస్వామి వీలునామా రాశాడని రెండో భార్య మహాలక్ష్మమ్మ చెబుతోంది. కందిమల్లాయపల్లె గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కొడుకుకు పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.  కందిమల్లాయపల్లె గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కొడుకుకు పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.


 

click me!