ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని... గొంతుకోసి చంపిన మేనమామ

Published : Jun 13, 2021, 08:40 AM IST
ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని... గొంతుకోసి చంపిన మేనమామ

సారాంశం

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఈ కసాయి మేనమామ.

విజయనగరం: ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని మేనమామే అతి కిరాతకంగా హతమార్చాడు. తల్లి పక్కనే నిద్రిస్తున్న చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు ఈ కసాయి మామ. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా కురపాం నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెంగవ గ్రామంలో కిల్లక పార్వతి కూతురు భవ్యశ్రీతో కలిసి నివాసముంటోంది. భర్తకు దూరంగా ఆమె పుట్టింట్లోనే వుంటోంది. అయితే రాత్రి ఇంట్లో తల్లి పక్కనే నిద్రిస్తున్న భవ్యశ్రీని మేనమామ వినోద్ అతి కిరాతకంగా గొంతుకోశాడు. కూతురు బిగ్గరగా కేకలు వేయడంతో పార్వతి లేచేసరికి వినోద్ పరారవుతూ కనిపించాడు. కూతురు రక్తపు మడుగులో పడివుండటాన్ని గమనించి కుటుంబసభ్యులను లేపింది. వారు వచ్చి చూడగా అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

read more  కిరాతకం... ప్రాణాలతోనే పాడి పశువుల తొడలు కోసి

చిన్నారి దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి తల్లి పార్వతి ఫిర్యాదు మేరకు నిందితుడు వినోద్ కోసం గాలింపు చేపట్టారు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతోనే వినోద్ ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu