రేపు పెళ్లి పెట్టుకుని.. వరుడు ఆత్మహత్య, పట్టాలపై పడుకున్న వధువు...!

Published : May 24, 2022, 08:38 AM ISTUpdated : May 24, 2022, 08:39 AM IST
రేపు పెళ్లి పెట్టుకుని.. వరుడు ఆత్మహత్య, పట్టాలపై పడుకున్న వధువు...!

సారాంశం

తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేపు పెళ్లి అనగా ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. 

హైదరాబాద్ : సహజీవనం చేస్తున్నమహిళను marriage చేసుకుందామని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. ఈ నెల 25న వివాహానికి ఏర్పాట్లు చేసుకోగా సోమవారం suicideకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ ఠానా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై  శ్వేత తెలిపిన వివరాల మేరకు…  ఏపీలోని కడప జిల్లాకు చెందిన విజయ్ కుమార్(40)కు పదిహేనేళ్ళ క్రితం వివాహమైంది. అదే జిల్లాలో రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరంలోని టప్పచపుత్రాలో నివసించే మహిళతో ఎనిమిదేళ్ల కిందట పరిచయమయ్యింది. సంవత్సర కాలంగా వీరిద్దరూ రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నారు.

ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల క్రితం విజయ్ కుమార్ ఆ మహిళకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆమె టప్పచపుత్రా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్రనగర్ నాకు బదిలీ చేశారు.  రాజేంద్రనగర్ పోలీసులు ఆదివారం విజయ్ కుమార్,  ఆ మహిళను  ఠాణాకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు. సోమవారం  పెళ్లి బట్టలు తెచ్చుకోవడానికి ఆమె వెళ్ళింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ్ కుమార్ కాబోయే భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె ఇంటికి చేరుకునేసరికి అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో ఆమె ఖైరతాబాద్ సమీపంలోని ఎంఎంటీఎస్ రైలు కింద పడి చనిపోవాలని పట్టాలపై పడుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెకు ఫోన్ సిగ్నళ్ళ ద్వారా గుర్తించి కాపాడారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 

కాగా, ఇలాంటి ఘటనే సోమవారం కర్నాటకలోని ఉడిపిలో జరిగింది. : తమ loveను ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై petrol పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన karnatakaలో చోటు చేసుకుంది.  ఉడిపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు దహనమవుతుండటాన్ని చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే యువతీ యువకులు అగ్నికి ఆహుతయ్యారు. బెంగుళూరుకు చెందిన యశ్వంత్, జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడిపివైపుకు పయనమయ్యారు. అంతకు ముందే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబపెద్దలకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తం అయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుపై పెట్రోల్ పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర  పోలీసులు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ‘మా నాన్న మూర్ఖుడు. తాగొచ్చి రోజూ నరకం చూపిస్తున్నాడు. అమ్మ బతికి ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు. ఆపై Liquorనికి బానిసై మృగం గా మారాడు. నాన్నా.. అని పిలవడానికి మనసు రావడం లేదు. ఆయనను చంపాలని  లేదా చనిపోవాలని ఉంది. మూడుసార్లు ఉరివేసుకున్నా,, కానీ..  ఎవరో ఒకరు కాపాడారు. ఆయన రోజూ harass చేస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో నా death news అందరికీ తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ మై డెత్’ అంటూ ఓ విద్యార్థిని గతంలోనే letter రాస్తుంది. tenth class examsకు ముందు రోజు ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu