విజయనగరం జిల్లాలోని ధర్మవరంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు చనిపోయాడు. ఓ మహిళ గాయపడింది. బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి కారణమైంది.
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ధర్మవరం వద్ద ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మహిళ తీవ్రంగా గాయపడింది.జిల్లాలోని శృంగవరపుకోట మండలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఫిట్స్ కు వచ్చాయి. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న బాలుడిని బస్సు ఢీకొట్టింది. అంతేకాదు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి బస్సు దూసుకెళ్లింది. ఇంట్లో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ఢీకొనడంతో బాలుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి బస్సు దూసుకెళ్లడంతో ఆ ఇల్లు దెబ్బతింది. మరో వైపు బస్సులోని ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు.
దేశంలోని పలు చోట్ల ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఉత్తర ఢిల్లీలోని తీస్ హజారీలో ఈ నెల 14వ తేదీన ఇదే తరహలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ కు ఫిట్స్ వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దరిమిలా బస్సు రాంగ్ రూట్ లోకి వెళ్లి ఆటోను డీకొట్టింది. ఈ ఘటనలో ఆటోరిక్షా డ్రైవర్ మరణించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజడ్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈ ఏడాది సెప్టెంబర్ 30 న చోటు చేసుకుంది. ఇవాళ కడప జిల్లా ముద్దనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆటో రిక్షా, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు.
undefined
also read:వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం..
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద కల్వర్టు గోడను కారు ఢీకొనడంతో కారులోని ప్రయాణీస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ నెల 16న ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందారు. చమోలి వద్ద బస్సు లోయలో పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన ఈ నెల 16న జరిగింది.