చంద్రబాబూ! డౌట్ అయితే స్ట్రాంగ్ రూంలో పడుకో: వైసీపీ నేత బొత్స

Published : Apr 13, 2019, 09:01 PM IST
చంద్రబాబూ! డౌట్ అయితే స్ట్రాంగ్ రూంలో పడుకో: వైసీపీ నేత బొత్స

సారాంశం

ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా  మే 23న వెలువడే ఫలితాల్లో వన్ సైడ్ రాబోతున్నాయని జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు రావడం పక్కా అని బొత్స ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబుతోపాటు తెలుగుదేశం పార్టీపై విరక్తి కలిగిందని అందువల్లే వైసీపీకి బ్రహ్మరథం పట్టారని స్పష్టం చేశారు.

విశాఖపట్నం: ఈవీఎంలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలు తాము ట్యాంపరింగ్ చేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 

అలాంటి పనులు చంద్రబాబు మాత్రమే చేస్తారని తాము చెయ్యమన్నారు. ఒకవేళ ట్యాంపరింగ్ పై అనుమానం వస్తే చంద్రబాబు స్ట్రాంగ్ రూంలో పడుకోవచ్చన్నారు. ఈవీఎంల పేరుతో చంద్రబాబు ఢిల్లీలో సరికొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. 

ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా  మే 23న వెలువడే ఫలితాల్లో వన్ సైడ్ రాబోతున్నాయని జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు రావడం పక్కా అని బొత్స ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబుతోపాటు తెలుగుదేశం పార్టీపై విరక్తి కలిగిందని అందువల్లే వైసీపీకి బ్రహ్మరథం పట్టారని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీపైనా ముఖ్యంగా చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతోనే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. మే 23న చంద్రబాబు గ్యాంగ్ ఊహించని ఫలితాలు రాబోతున్నాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే