లోకేష్ లాంటి సుంటను చంద్రబాబు ఎలా కన్నారు...: మంత్రి బొత్స సంచలనం

By Arun Kumar PFirst Published Jun 18, 2020, 9:04 PM IST
Highlights

గురువారం శాసన మండలి జరిగిన తీరు... డిప్యూటి స్పీకర్ సభ జరిపిన తీరు...టీడీపీ సభ్యుల ప్రవర్తన, వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

అమరావతి: గురువారం శాసన మండలి జరిగిన తీరు... డిప్యూటి స్పీకర్ సభ జరిపిన తీరు...టీడీపీ సభ్యుల ప్రవర్తన, వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సంఖ్యా బలం ఉందని మందస్తుగానే నిర్ణయించుకుని వ్యూహాత్మకంగా సభను అడ్డగించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. 

''బుధవారం మండలి ప్రారంభానికి ముందు ఉదయమే మండలి ప్రతిపక్ష నాయకుడు యనమల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సభలో తేల్చుకుంటామని. అంతేకాకుండా ముందురోజే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగారు. అంటే ఈ గొడవ జరుగుతుంది అని వారికి ముందే తెలుసన్నది స్పష్టమవుతోంది'' అని బొత్స తెలిపారు. 

''మండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  రూలింగ్ ఇస్తున్నారు. టీడీపీ సభ్యులను మా సభ్యులు అంటున్నారు. టీడీపీ ఏమి చెపుతుందో దానికే ఆయన వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ బిల్లులకు అడ్డు పెడుతున్నారు'' అని పేర్కొన్నారు. 

''టీడీపీకి కొన్ని బిల్లులు పట్ల అభ్యంతరం ఉండటంలో తప్పులేదు. అయితే నిబంధనలను వారు తుంగలో తొక్కారు. మూడ్ ఆఫ్ ది హౌస్ తీసుకోవాలని తాము కోరామని...  ద్రవ్యవినిమయ బిల్లు తీసుకోవాలని అన్నాము. అయితే రూల్ 90 పై చర్చ జరగాలని వారే అన్నారు. ఇలా ప్రతి బిల్లును అడ్డుకోవాలని ఓ వ్యూహం ప్రకారం వచ్చారు. మేము సంయమనం పాటించినా వారు పాటించలేదు'' అని బొత్స తెలిపారు.

read more    శాసనమండలి పరిణామాలు... అసలు జరిగింది ఇదీ: టిడిపి ఎమ్మెల్సీ మంతెన వివరణ

''ఇక లోకేష్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని సభలో జరుగుతున్న పరిణామాలను ఫోటోలు తీస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో తాము చైర్మన్ కి పిర్యాదు చేసాం. చైర్మన్ చెప్పినా ఆయన వినకుండా ఫోటోలు తీస్తూనే వున్నారు'' అని అన్నారు. 

''అసలు టీడిపి నాయకులు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు. ప్రజా తీర్పును కండబలంతో ఎదుర్కోవాలని అనుకుంటారా...ఎవరో అడిగితె చెప్పాను ఇలాంటి శుంఠ ను ఎలా కన్నారు చంద్రబాబు'' అంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు.  

''మూడు బిల్లులో ఏ బిల్లు తీసుకోవాలని చైర్మన్ అడిగితే ద్రవ్య వినిమయ బిల్లు తీసుకోమని చెప్పాము.సీఎం కూడా ఫోన్ చేసి వాళ్ళు కోరినట్లు ద్రవ్యవినిమాయ బిల్లు పెట్టమన్నారు.అయితే వాళ్లు కొత్త సాంప్రదాయాన్ని తెస్తామన్నారు.ఎంత బాధగా ఉన్న, కోపం వచ్చిన నిన్న సభ లో సమ్యమనం వహించాం. ఇలాంటివి భవిసత్తులో పునరావృతం కావద్దని కోరుతున్నాం'' అన్నారు. 

''డిప్యూటీ స్పీకర్ ను జడ్జ్ అని అనుకున్నాం కానీ ఆయన ఒక పార్టీ నాయకుడుగా వ్యవహరించారు. లోకేష్ ఫోటోలు తీస్తారు, మంత్రుల మీద కలబడతారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ లోనూ చర్చించాం. లెటర్ పెట్టి టీడీపీ సభ్యులు వీడియో ఫుటేజ్ తీసుకోండి...మేమూ తీసుకుంటాం. ద్రవ్యవినిమాయ బిల్లు ఆమోదించాక పోవడం వల్ల ఉద్యోగులకు 2 రోజులు జీతాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగులను అర్థం చేసుకోవాలని మేము కోరుతాము... బతిమాలుకుంటాము'' అని మంత్రి బొత్స వెల్లడించారు.
   

click me!