నష్టం లేదు, అయినా తలుపులు తెరిచే ఉంటాయి: వంగవీటి రాధాపై బొత్స వ్యాఖ్యలు

Published : Jan 25, 2019, 05:18 PM IST
నష్టం లేదు, అయినా తలుపులు తెరిచే ఉంటాయి: వంగవీటి రాధాపై బొత్స వ్యాఖ్యలు

సారాంశం

రాధాను పార్టీలో ఉండాలంటూ తాను కోరానని తెలిపారు. రాధా టీడీపీలో చేరితే వైసీపీకి ఒక్కశాతం కూడా నష్టం లేదని స్పష్టం చేశారు. రాధాకృష్ణను వైసీపీ వదులు కోవాలని ఏనాడు ప్రయత్నించలేదన్నారు. రాధా కోసం వైసీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. 

విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాధతో మూడు సార్లు చర్చలు జరిపానని చెప్పుకొచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన రాధా తనతో చర్చలు జరుపుతూ వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఇచ్చారన్న వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. 

రాధాను పార్టీలో ఉండాలంటూ తాను కోరానని తెలిపారు. రాధా టీడీపీలో చేరితే వైసీపీకి ఒక్కశాతం కూడా నష్టం లేదని స్పష్టం చేశారు. రాధాకృష్ణను వైసీపీ వదులు కోవాలని ఏనాడు ప్రయత్నించలేదన్నారు. 

రాధా కోసం వైసీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విబేధాల నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ ఈనెల 21న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

అనంతరం ఈనెల 24న మీడియాతో మాట్లాడిన రాధా తాను సీటు విషయంలో పార్టీ వీడటం లేదని జగన్ అన్న మాటలు భరించలేకే బయటకి వచ్చినట్లు తెలిపారు. రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు