అమరావతిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు: బొత్స స్పందన ఇదీ...

By telugu teamFirst Published Sep 9, 2020, 12:08 PM IST
Highlights

అమరావతిని శాసన రాజధానిగా కూడా కొనసాగించకూడదని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కొడాలి నాని వ్యాఖ్యలను వక్రీకరించవద్దని ఆయన కోరారు.

విజయవాడ: అమరావతి శాసన రాజధానిగా కూడా వద్దంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. కొడాలి నాని వ్యాఖ్యలను వక్రీకరించవద్దని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అది కేవలం నాని అభిప్రాయం మాత్రమేనని ఆయన చెప్పారు.

అమరావతి నుంచి శాసన రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అనడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సాంకేతిక కారణాలు అడ్డుపెట్టుకుని కొందరు అడ్డు పడుతున్నారని ఆయన అన్నారు.

Also Read: అసలుకే ఎసరు: అమరావతిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు చెందినదిగా ఉండాలని ాయన అన్నారు. కొంత మంది మాత్రమే రాజధానిలో ఉండాలనుకోవడం సరి కాదని ఆయన అన్నారు.

విజయవాడ మధురా నగర్ లోని ట్రాఫిక్ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆయన చెప్పారు. వెంటనే అండర్ బ్రిడ్జి చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రూ.17 కోట్ల ప్రభుత్వ నిధులు, రూ.10 కోట్ల రైల్వే నిధులతో ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని బొత్స చెప్పారు.

click me!