వైసీపీ నేత కుమార్తె ఇంట్లో చోరీ

Published : Apr 15, 2019, 02:57 PM IST
వైసీపీ నేత కుమార్తె ఇంట్లో చోరీ

సారాంశం

వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి కుమార్తె ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా విద్యానగర్ లో నివాసం ఉండే జంగా కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ త్రివేణి ఇంట్లో చోరీ జరిగింది. 

వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి కుమార్తె ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా విద్యానగర్ లో నివాసం ఉండే జంగా కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ త్రివేణి ఇంట్లో చోరీ జరిగింది. త్రివేణి అమరావతి రోడ్డులోని ఐడీ హాస్పటల్ లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

వారం రోజుల క్రితం ఆమె ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లారు. ఆమె భర్త జనార్థన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో గామాలపాడు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు.. ఇంటి వెనుక కిటికీలో నుంచి తలుపు గడియ తీసి లోపలికి ప్రవేశించారు.

ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన 12సవర్ల బంగారు ఆభరణాలు, 30వేల నగదు అపహరించుకుపోయారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన త్రివేణి చోరీ జరిగిన విషయం గమనించి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు