ఆనందయ్య కరోనా మందు పంపిణీ నిలిపివేత.. రెండు రోజుల వరకు లేనట్టే...

By AN Telugu  |  First Published May 21, 2021, 11:45 AM IST

కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందు పంపిణీ రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఆయుర్వేద మందు కోసం ఎక్కువ సంఖ్యలో జనాలు రావడమే దీనికి కారణం.


కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందు పంపిణీ రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఆయుర్వేద మందు కోసం ఎక్కువ సంఖ్యలో జనాలు రావడమే దీనికి కారణం. మందు తయారీకి మూలికలను సేకరించుకోవడానికి రెండు రోజుల పాటు మందు ఇవ్వదం లేదని చెబుతున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలనుంచి కూడా కరోనారోగులు వెల్లువెత్తుతుండడంతో పోలీసులకు వారిని అదుపు చేయడం కష్టంగా మారిపోయింది. కృష్ణపట్నం ఆయుర్వేద మందుల కేంద్రం వద్ద తోపులాట జరిగింది. 

Latest Videos

undefined

అయితే తమ దగ్గర కేవలం మూడువేల మందికి సరిపోయే మందు మాత్రమే ఉందని.. ప్రవాహంలా వస్తున్న కరోనా రోగులందరికీ తమ దగ్గరున్న మందు సరిపోదని వారు అంటున్నారు. అందుకే రెండు రోజుల్లో మందు తయారీకి కావాల్సిన ముడి సరుకు తెచ్చుకుని.. మందు తయారీ చేస్తామని వారు తెలిపారు. 

రోగులెవ్వరూ నిరాశ పడొద్దని.. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని తెలిపారు. ఈ తోపులాటలో కరోనా రోగి కిందపడిన ఘటన చోటు చేసుకుంది. 

కాగా, కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేదం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ మందుపై అంతటా చర్చ సాగుతోంది. వేలాది మందిగా ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. తాను ఇస్తున్న మందుకు ఆయన డబ్బులేమీ వసూలు చేయడం లేదు. 

ఆయన ఇస్తున్న మందుతో ఒక్కరోజులోనే ఎంత తీవ్రమైన కేసైనా తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం వంటి జరుగుతున్నాయని చెబుతున్నారు, ఇంత వరకు ఈ వైద్యంపై ఒక్క రిమార్క్ కూడా రాలేదు. వేలాది మంది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వేలసంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఆ మందు కోసం వస్తున్నారు. ఎంతో మంది అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నవారు కూడా రెండు రోజుల్లో కోలుకొని వెళ్లిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు.  కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ వస్తోందని, సీటీ స్కాన్ లో చెస్ట్ సివియారిటీ స్కోర్  24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే  జీరోకు వస్తోందని అంటున్నారు.ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చుంటున్నారని చెబుతున్నారు.

click me!