అది నా అదృష్టం..బోండా ఉమ

Published : Feb 08, 2019, 11:25 AM IST
అది నా అదృష్టం..బోండా ఉమ

సారాంశం

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 150సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే బోండా ఉమ ధీమా వ్యక్తం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 150సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే బోండా ఉమ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం కష్డపడుతోందని ఆయన అన్నారు. ప్రజల కోసం కష్టడిన నేతలందరూ మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్పారు. చంద్రబాబుతో కలిసి పనిచేయడం తన అదృష్టం అని చెప్పారు.

తొలి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టమన్నారు. కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని ఎందురో హామీలు ఇచ్చారని.. అయితే.. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేవలం టీడీపీ మాత్రమే అని అన్నారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన ఘనత..ఏపీలో తొలి టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజాతీర్పును ఉల్లంఘించడమే అని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి వస్తున్నారో జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని బోండా ఉమ హితవు పలికారు.
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!