సీలేరు నదిలో పడవలు బోల్తా: 8 మంది వలస కూలీలు గల్లంతు

Published : May 25, 2021, 07:17 AM ISTUpdated : May 25, 2021, 08:30 AM IST
సీలేరు నదిలో పడవలు బోల్తా: 8 మంది వలస కూలీలు గల్లంతు

సారాంశం

సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వారంతా వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాదు నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద చోటు చేసుకుంది. గల్లంతైనవారంతా వలస కూలీలుగా తెలుస్తోంది. ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు.

కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ నేపథ్యంలో వలస కూలీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

వలస కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందినవారని తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?