వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు: ప‌లువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Published : Dec 11, 2022, 12:49 AM IST
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు: ప‌లువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

సారాంశం

Visakhapatnam: విశాఖ ఉక్కు కర్మాగారంలో ట్యాంక్ పేలి ప‌లువురు గాయ‌ప‌డ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని తార్ ట్యాంక్ నంబర్ 11 వద్ద నిర్వహణ పనుల సమయంలో పేలుడు సంభవించిందని స‌మాచారం.   

Blast in Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారంలో ట్యాంక్ పేలి ప‌లువురు గాయ‌ప‌డ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని తార్ ట్యాంక్ నంబర్ 11 వద్ద నిర్వహణ పనుల సమయంలో పేలుడు సంభవించిందని స‌మాచారం. శనివారం జరిగిన పేలుడులో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.  ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరైన జీ.నగేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పేలుడు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ ఈ ముగ్గురూ ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు.
 

"విశాఖ ఉక్కు కర్మాగారంలో ట్యాంక్ పేలిన ఘ‌ట‌న‌లో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నగేష్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మొదట వారిని మెరుగైన చికిత్స కోసం మల్కాపురం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఇఎస్ఐ ఆసుపత్రి నుండి ఇండస్ ఆసుపత్రికి రెఫర్ చేసి ఐసీయూ పర్యవేక్షణలో ఉన్నారు" అని విశాఖపట్నం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదాలు అసాధారణం కాదు. గత ఏడాది ఇదే నెలలో ఇలాంటి సంఘటన జరిగింది.

తుయెర్స్ శీతలీకరణ ప్రక్రియలో లోపం వల్ల పేలుడు సంభవించింది. బిఎఫ్ -2 లో వృత్తాకార క్రేన్ కాలిపోయిందనీ, కూలింగ్ పైపులు దెబ్బతిన్నాయనీ, పేలుడు తరువాత ఓవెన్లో గణనీయమైన పరిమాణంలో కోక్, ఇనుప ఖనిజం వ్యాపించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి.

ఉక్కు కర్మాగారాల్లో తుయర్లు పేలడం సాధారణం అనీ, ఈ సంఘటన తేలికపాటిదని వీఎస్పీ అధికారులు పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో ఉత్పత్తి తిరిగి ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. మరోవైపు, ఉత్పత్తి, పరికరాల నష్టం కోట్ల రూపాయలు ఖర్చవుతుందనీ, పునరుద్ధరణకు ఐదు రోజులు పడుతుందని కార్మికులు అంచనా వేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?