తూ.గో జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 12 మందికి తీవ్ర గాయాలు

Published : Sep 30, 2019, 10:29 AM ISTUpdated : Sep 30, 2019, 10:38 AM IST
తూ.గో జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 12 మందికి తీవ్ర గాయాలు

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలోని బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది.ఈ  ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 


సామర్లకోట:తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం నాడు ఉదయం  పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మేడపాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది.పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు ప్రకటించారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ పేలుడు కారణంగా భారీగా శబ్దం విన్పించింది. దీంతో స్థానికులు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. బాణసంచా ఫ్యాక్టరీలో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్