చిక్కుల్లో అచ్చెన్నాయుడు...ఎన్నికపై హైకోర్టు నోటీసులు

By telugu teamFirst Published Sep 30, 2019, 9:47 AM IST
Highlights

అచ్చెన్నాయుడు ఎన్నికపై వైసీపీ అభ్యర్థి తిలక్ చేసిన  ఫిర్యాదుపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ పిటిషన్ సంఖ్య 6తో జారీ అయిన నోటీసులకు అక్టోబర్ 17న సంబంధిత వ్యక్తులు సమాధానం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ సీనీయర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు... చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నిక సరిగా లేదంటూ...వైసీపీ నేత ఒకరు హైకోర్టుని ఆశ్రయించారు. అచ్చెన్నాయుడు ఎన్నికపై వైసీపీ అభ్యర్థి తిలక్ చేసిన  ఫిర్యాదుపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ పిటిషన్ సంఖ్య 6తో జారీ అయిన నోటీసులకు అక్టోబర్ 17న సంబంధిత వ్యక్తులు సమాధానం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.

కింజారపు అచ్చెన్నాయుడు తోపాటు కాంగ్రెస్ అభ్యర్థి చింతాడ దిలీప్ కుమార్, బీజేపీ అభ్యర్థి హనుమంతు ఉదయ్ భాస్కర్, జనసేన అభ్యర్థి కణితి కిరణ్ కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చంద్రశేఖర పట్రాయక్, స్వతంత్ర అభ్యర్థులు గూట్ల కాంచన, గడ్డెవలస రాముతోపాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, టెక్కలి ఆర్డీవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పేరాడ తిలక్ ఫిర్యాదు స్వీకరించేందుకు అర్హమైనదా కాదా పరిశీలించేందుకు సంబంధిత వ్యక్తులు తగిన సమాచారంతో కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం పేర్కొంది. 

click me!