ప్యాకేజీకి రైట్ అని ఇప్పుడు యూటర్న్ : చంద్రబాబుపై బీజేపీనేత సుధీష్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 4:15 PM IST
Highlights

ఒకప్పుడు ప్యాకేజీకి రైట్‌ రైట్‌ అన్న చంద్రబాబు తర్వాత యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఏం చేయాలో తోచక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ దీక్ష కోసం రైల్వే శాఖకు జీవో విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు అండ్ కో ఇష్టం వచ్చినట్లు డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. 

ఒకప్పుడు ప్యాకేజీకి రైట్‌ రైట్‌ అన్న చంద్రబాబు తర్వాత యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఏం చేయాలో తోచక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ దీక్ష కోసం రైల్వే శాఖకు జీవో విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

దీక్షలో పాల్గొనే నాయకుల కోసం సిగ్గు లేకుండా ఏసీ హోటళ్లు బుక్‌ చేశారని మండిపడ్డారు. బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది వికృత రాజకీయ విన్యాస క్రీడ అని, కొత్త బూచిని చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్న చంద్రబాబు ప్రస్తుతం హోదా రాగం పాడుతున్నారని ధ్వజమెత్తారు. 2016 ఆగష్టు నీతి ఆయోగ్ సమావేశంలో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో ప్రత్యేక హోదా అంశం గురించి ప్రస్తావించారని అయితే ఆ సయయంల ప్యాకేజీయే మేలు అని చంద్రబాబు, సుజనాచౌదరిలు అనలేదా అని ప్రశ్నించారు. హోదా కంటే ప్యాకేజీయే మేలు అన్న చంద్రబాబు ఇప్పుడు కొత్తగా హోదా రాగం అందుకున్నారని సుధీష్ రాంభొట్ల ఆరోపించారు. 

click me!