వైదొలిగిన సుభాష్ రెడ్డి: షాద్ నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా

By narsimha lodeFirst Published Feb 12, 2019, 4:12 PM IST
Highlights

షాద్‌నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ సుభాష్  రెడ్డి నిరాకరించారు. మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆయన కోరారు.


న్యూఢిల్లీ: షాద్‌నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ సుభాష్  రెడ్డి నిరాకరించారు. మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆయన కోరారు.

ఈ కేసు విషయమై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ కేసు విచారణ సమయంలో బెంచ్‌పై జస్టిస్ సుభాష్ రెడ్డి ఉన్నారు. దీంతో ఈ కేసు విచారణకు ఆయన అంగీకరించలేదు.. ఈ కేసును మరో బెంచ్‌కు  బదిలీ చేయాలని ఆయన కోరారు. 

1990 డిసెంబర్ 5వ తేదీన ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ బస్టాండ్‌లో  అప్పటి కాంగ్రెస్ నేతలు దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేశారు. హత్యకు గురైన వారు ప్రస్తుత మంత్రి  ఆదినారాయణరెడ్డి చిన్నాన్న.

మరో వైపు ఈ హత్యలకు ప్రతీకారంగా టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి  బాబాయ్ శివారెడ్డిని ప్రత్యర్థులు హైద్రాబాద్‌లో హత్య చేశారు.  గతంలో  వీరిద్దరూ కూడ వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. జమ్మలమడుగు  నియోజకవర్గంలో  టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్యాక్షన్ గొడవలు సాగేవి. ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరారు. వైసీపీ నుండి ఆయన టీడీపీలో చేరారు.

వైసీపీ నుండి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి బాబు కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని దోషిగా తేల్చింది.ఈ తీర్పుపై రామసుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రామసుబ్బారెడ్డిని నిర్షోషిగా తేల్చింది.

ఈ కేసులో రామసుబ్బారెడ్డిని నిర్ధోషిగా తేల్చడంతో  ఆదినారాయణరెడ్డి వర్గీయులు 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయమై ఇంకా తుది తీర్పు వెలువడలేదు.

సంబంధిత వార్తలు

సుప్రీం తీర్పు: రామసుబ్బారెడ్డి భవితవ్యం తేలేది నేడే

click me!