బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ ఫోన్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రేపు విజయవాడలో భేటీ కానున్నారు.
అమరావతి: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ గురువారం నాడు ఫోన్ చేశారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కన్నా లక్ష్మీనారాయణ శివప్రకాష్ కు వివరించారు. రేపు శివప్రకాష్ తో కన్నా లక్ష్మీనారాయణ భేటీ కానున్నారు. పార్టీలో ఓ వర్గం తనపై దుష్ప్రచారం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ శివప్రకాష్ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా సమాచారం. గగత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న ఘటనలను కన్నా లక్ష్మీనారాయణ శివప్రకాష్ దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీ బీజేపీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ బీజేపీ చీఫ్ పోము వీర్రాజుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడానికి సోము వీర్రాజు వైఖరే కారణమన్నారు. జనసేనతో బీజేపీకి సరైన సంబంధాలు లేకపోవడానికి వీర్రాజు కారణమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఈ నెల 15, 6 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరిగాయి.ఈ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు.
undefined
ఈ నెల 24న భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు వ్యక్తిగత పనుల నిమ్మిత్తం కన్నా లక్ష్మీనారాయణ హైద్రాబాద్ కే పరిమితమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అదే రోజున పల్నాడు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు బీజేపీకి రాజీనామాలు సమర్పించారు. సోము వీర్రాజు వైఖరిని నిరిస్తూ తాము రాజీనామా చేస్తున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు ప్రకటించారు.
also read:నేడు భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: దూరంగా కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ వీడుతారా?
కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రావడం లేదో పార్టీ నాయకత్వానికి సమాచారం పంపినట్టుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు.ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరుతారని ప్రచారం కూడా సాగింది.ఈ ప్రచారాన్ని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.