రాయలసీమలో అంటరానితనం ఉంది.. టీజీ వెంకటేష్ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Oct 17, 2019, 11:10 AM IST
Highlights

స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించుటకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అక్కడక్కడా అంటరానితనం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే... ఆ  అంటరానితనాన్ని రూపుమాపేందుకు బీజేపీ నేతలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

టీడీపీ రాజ్యసభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్... ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా... గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్లాస్టిక్ వల్ల లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.

స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించుటకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి లక్షల కోట్లు నిధులు వస్తున్న సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని టీజీ వెంకటేష్ విమర్శలు గుప్పించారు.

కాగా... టీజీ వెంకటేష్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  రాజధాని అమరావతిని మార్చేస్తున్నారని... వేరే ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నారంటూ తొలుత కామెంట్స్ చేసింది టీజేనే. అతని కామెంట్స్ తర్వాత రాజధాని అంశం తీవ్ర వివాదాస్పదమైంది.

తాజాగా... తిరుమల ఆాదాయంపై కూడా కామెంట్స్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని, టీటీడీకి వచ్చే ఆదాయాన్ని రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని ఆనయ అన్నారు. 

విజయవాడ దుర్గ గుడి, సింహాచలం ఆలయాల డబ్బులు ఆ ప్రాంతానికి ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలవారిని టీటీడీ సభ్యులుగా నియమిస్తున్నారని, కానీ వారు మాత్రం రాయలసీమ అభివృద్ధిపై మాత్రం మనసు పెట్టడం లేదని ఆయన అన్నారు. 

రాయలసీమ నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని టీజీ వెంకటేష్ అన్నారు. గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికే ఇచ్చి రాయలసీమ నీళ్లు సీమ వాడుకునేలే చేస్తామని గతంలో వైఎస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో అలజడులు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. 

గుండ్రేవుల, సిద్ధేశ్వరం, అలుగు ప్రాజెక్టులు నిర్మిస్తే తమ నీళ్లు తామే వాడుకోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆయన అన్నారు. సిఎం జనగ్ కూడా ఎన్నికల ప్రణాళిక హామీలకే రాష్ట్ర బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతుందని అన్నారు. 

అమరావతిని ఫ్రీ జోన్, నీళ్లు, నిధుల విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ ప్రాజెక్టులను అతి వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

click me!